బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు.. అందులో నేను లేను: హీరో

Thursday, May 31st, 2018, 06:27:44 PM IST

మొదటి సీజన్ లో తెలుగు బిగ్ బాస్ మంచి పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనదైన శైలిలో షోను నడిపించి హిట్ చేశాడు. అయితే ఈ సారి వ్యాఖ్యాతగా నాని ఉండబోతున్న సంగతి తెలిసిందే. 100 రోజుల పాటు షోని నిర్వహించడానికి స్టార్ మా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసుకుంది. అయితే దాదాపు కంటెస్టెంట్స్ ని కూడా ఫైనల్ చేసినట్లు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అందులో చాలా మంది ప్రముఖ నటీనటుల పేర్లు వినిపించడంతో ఆసక్తి రేగుతోంది. అయితే అది ఎంతవరకు నిజం అనేది ఇంకా ఎవరు క్లారిటీ ఇవ్వడం లేదు.

కానీ రీసెంట్ గా ఒక హీరో మాత్రం తాను లేనని చెప్పేశాడు. అతను ఎవరో కాదు యువ హీరో తరుణ్. బిగ్ బాస్ షోలో తాను పార్టిసిపేట్ చేయడం లేదని అలంటి ఆలోచన కూడా తనకు లేదని వివరించాడు. ప్రస్తుతం
వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని రూమర్స్ ని నమ్మవద్దని తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. మొత్తంగా ఈ సారి 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. శని ఆదివారాల్లో 9 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు 9.30 గంటలకు స్టార్ట్ కానుంది.

ప్రస్తుతం పార్టిసిపేట్స్ విల్లే అని వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే: హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, యాంక‌ర్ లాస్య‌, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి, శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, ఆర్యన్‌ రాజేష్