డివైడర్‌ను ఢీకోట్టిన హీరో నాని కారు.. కేసు నమోదు !

Friday, January 26th, 2018, 06:12:49 PM IST

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని కారు ప్రమాదానికి గురవడం అందరిని షాక్ కి గురి చేసింది. మొదట నాని అందులో ఉన్నట్లు కొన్ని మీడియాల్లో కథనాలు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తరువాత అందులో నాని లేడని తెలిసింది. కేవలం డ్రైవర్ ఒక్కడే అందులో ఉండగా కారు ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నం.45లో శుక్రవారం తెల్లవారుజామున కారును వేగంగా నడపడం వల్ల అదుపు తప్పి డివైడర్‌ను ఢీకోట్టినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 3/పీపీడీఏ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా నాని సైడ్ నుంచి ఎటువంటి వివరణ రాలేదు. కారులో అయితే డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.