సునీల్ ఛాన్సును కొట్టేసిన కుర్ర హీరో

Thursday, January 25th, 2018, 04:55:18 PM IST


కమెడియన్ నుంచి హీరోగా మరీనా సునీల్ గత కొంత కాలంగా ఎంత ప్రయత్నించినా అపజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కెరీర్లో కమెడియన్ గా సక్సెస్ అయిన సునీల్ ఇప్పుడు హీరోగా ఏ మాత్రం సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. అంతే కాకుండా సునీల్ గతంలో ఒకే చేసిన సినిమాలు కూడా ప్రస్తుతం చేజారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సునీల్ చతురంగ వేట్టై అనే తమిళ సినిమా రీమేక్ ను గత ఏడాది ఓకే చేశాడు. నిర్మాత కృష్ణ ప్రసాద్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ రీసెంట్ గా నిర్మాత వేరే హీరోతో సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ఛాన్స్ దక్కించుకున్నది మరెవరో కాదు. జ్యోతి లక్ష్మి సినిమా హీరోగా చేసిన సత్య దేవ్. అయితే సునీల్ తో క్యాన్సిల్ చేసుకోవడానికి కథా చర్చల్లో నిర్మాతకి అతనికి క్లాష్ రావడమే కారణమని టాక్ వస్తోంది. మరి ఆ రీమేక్ తో సత్యదేవ్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం సునీల్ చేతిలో ఒక సినిమా ఉంది. భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సుడిగాడు సీక్వెల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ప్రాజెక్టులో కూడా ఒక కామెడీ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.