మెగాస్టార్ మీటింగ్ కోసం 18 మంది హీరోలు .. అసలు ఏమి జరుగుతుంది ?

Wednesday, April 25th, 2018, 02:15:07 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లోని పరిస్థితులు బాగా వేడెక్కాయి. వరుసగా పలువురు సంచలన కామెంట్స్ తో తెలుగు పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నారంటూ సినిమా పరిశ్రమ మొత్తం ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. పలువురు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న వివాదాలు. పవన్ కళ్యాణ్, శ్రీ రెడ్డి, వర్మ లాంటి వ్యవహారాలపై టాలీవుడ్ వేడెక్కిన నేపథ్యంలో అన్ని విభాగాలను కలుపుకుని పరిశ్రమలో మళ్ళీ అన్ని పరిస్థితులు చక్కదిద్దేలా రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి నిన్న సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో లో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ లో ఏకంగా 18 మంది హీరోలు పాల్గొనడం విశేషం. వారితో పాటు పలువురు నిర్మాతలు , దర్శకులు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా పాల్గొన్నారని తెలిసింది. ఈ మీటింగ్ లో కొన్ని మీడియా ఛానల్స్ పై చర్య తీసుకునేలా, అలాగే సినిమాకు సంబందించిన యాడ్స్, ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ విషయంలో కూడా చర్చలు జరిపారట. అసలు వీరందరూ కలిసి ఏమి తీర్మానించారన్న విషయం ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది. మరి నిన్న అన్నపూర్ణ స్టూడియో లో జరిగిన మీట్ లో అల్లు అరవింద్, మహేష్, చరణ్, నాగబాబు, అల్లు అర్జున్,నాని, వరుణ్ తేజ్, రామ్, నాగ చైతన్య, నాగార్జున, సుమంత్, వెంకటేష్, జీవిత, భోగవల్లి ప్రసాద్, నారాయణ, జెమినీ కిరణ్ లాంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నట్టు తెలిసింది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న రన్న విషయం పై త్వరలోనే వారు ఛాంబర్ ద్వారా తెలియచేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments