తెలుగు పరిశ్రమను విజయవాడకు రప్పిస్తారా? జోక్ అఫ్ ది డే!

Thursday, September 28th, 2017, 12:53:47 PM IST

తెలుగు సినిమా రంగాన్ని హైద్రాబాద్ నుండి విజయవాడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నాడు. ఆ దిశగా జోరుగా సన్నాహాలు మొదలు పెట్టమని, ఇక్కడ సినిమాను తీసే వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇస్తామని చెబుతున్నాడు ఎపి ఎఫ్ డి సి చైర్మన్ నిర్మాత అంబికా కృష్ణ ? లేటెస్ట్ గా జరిగిన జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అయన మాట్లాడుతూ ఈ మాటలు చెప్పాడు. చెన్నై లో ఉన్న తెలుగు పరిశ్రమను హైద్రాబాద్ కు తీసుకురావడానికి అప్పట్లో పెద్ద స్టార్ హీరోగా ఉన్న అక్కినేని కె చాలా సమయం పట్టింది .. మరి ఇది అంబికా కృష్ణ వల్ల అవుతుందా .. ? అయినా ఇప్పుడు తెలుగు పరిశ్రమ విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఏమిటో ఆయనకే తెలియాలి. ఇక్కడ పరభాషా సినిమాలు రూపొందడం లేదు .. పైగా తెలుగు సినిమాలకు నైజాం అతిపెద్ద మార్కెట్ .. అలాంటిది పరిశ్రమ విజయవాడకు వెళితే .. ఇక్కడ ఆంధ్రా లో నిర్మించిన తెలుగు సినిమాలకు మార్కెట్ దెబ్బతినే పరిస్థితి వస్తుందని విశేషకులు భావిస్తున్నారు. చూద్దాం .. ఏమి జరుగుతుందో !!

  •  
  •  
  •  
  •  

Comments