తెలుగులో 2.0 చిత్రాన్ని కొనే నాధుడే లేడా..?

Tuesday, September 11th, 2018, 05:55:43 PM IST

“సూపర్ స్టార్ రజినీకాంత్” ఈ పేరు చెప్తే చాలు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతాయి, ఆయన క్రేజ్ ఎంత అంటే ఆయన చిత్రం విడుదల ఐతే విదేశాలలో కంపెనీలకి కూడా సెలవు ప్రకటిస్తారు. అదే సూపర్ స్టార్ కి దర్శకుడు శంకర్ తోడైతే..? ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో ఇది వరకు విడుదల అయిన “శివాజీ” మరియు “రోబో” చిత్రాలను చూస్తే తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు వారి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే ఇంకెన్ని అంచనాలు ఉంటాయి..? దానికి తోడు 450కోట్ల బడ్జెట్ సినిమా అంటే ఇక ఆ అంచనాలు ఆకాశంలో ఉంటాయి..

అయినా సరే ఈ సినిమాని తెలుగులో కొనేందుకు ఎవరు సాహసించట్లేదు.. దీనికి కారణం శంకర్ మరియు రజిని ఇద్దరి ముందు రెండు సినిమాలు ఘోర పరాజయాన్ని చూశాయి.రజిని యొక్క “కబాలి” చిత్రం ఐతే ఎలాంటి అంచనాల నడుమ విడుదల అయ్యి ఎలాంటి ఫలితాన్ని చూసిందో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దీని వల్ల వీరి ఇద్దరి కాంబినేషన్ పెద్దదే అయినా ఎందుకో మన తెలుగులో కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు సంకోచిస్తున్నారు. దీనితో లైకా ప్రొడక్షన్ వారికి డైరెక్టుగా విడుదల చేసుకోవడం తప్ప వేరే దారి కనిపించడం లేదు.. ఐతే ఈ నెల 13న 2.0 చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేస్తున్నారు. దాన్ని బట్టి ఈ చిత్రాన్ని మన తెలుగులో తీసుకుంటారు అన్నట్టు తెలుస్తుంది.. వేచి చూద్దాం ఎం జరుగుతుందో..

  •  
  •  
  •  
  •  

Comments