బ్రేకింగ్ న్యూస్ : అన్నపూర్ణ స్టూడియోస్ కు పవన్.. పెరుగుతున్న అభిమానుల ఉద్రిక్తత…

Saturday, April 21st, 2018, 12:53:29 PM IST

గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు, దానయ్య,ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్‌ కుమార్‌, సీ కల్యాణ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన యన్‌వి ప్రసాద్‌, నరేష్‌, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, జెమినీ కిరణ్, కాశీ విశ్వనాథ్‌, హలు అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోకు చేరుకున్నారు.

పవన్‌ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments