టాలీవుడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు .. అంత సెల్ఫిష్‌గా మారారా..?

Thursday, October 18th, 2018, 11:07:53 AM IST

తిత్లీ తుఫాన్ ఉత్త‌రాంధ్ర మొత్తం అత‌లాకుత‌లం అయిపోయింది. దీంతో ఈ తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు స‌హాయం చేయ‌డాని కొంత‌మంది సినీ స్టార్స్ ముందుకు వ‌చ్చారు. మొద‌ట‌గా సంపూర్ణేష్ బాబు 50వేల విరాళాన్ని ప్ర‌క‌టించ‌గా.. ఆ తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ త‌మ‌వంతుగా ఆర్ధిక సహాయాన్ని సీయం రిలీఫ్ పండ్‌కు పంపించారు. యంగ్ హీరో నిఖిల్ అయితే ఏకంగా తిల్లీ తుఫాను వ‌ల్ల దెబ్బ తిన్న ప్రాంతాల‌కు నేరుగా వెళ్ళి వారికి స‌హాయం అందించారు. ఇక తాజాగా సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు స్పందిచ‌లేదు. ఇత‌ర రాష్ట్రాల్లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా స్పందించే ఈ స్టార్లు.. సొంత రాష్ట్రానికి మాత్రం క‌ష్టం వ‌స్తే క‌నీసం స్పందిచ‌క పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వీరి పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. గ‌తంలో కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు.. వెంట‌నే స్పందించి భారీగా విరాళాలు ఇచ్చిన మ‌న హీరోలు.. సొంత రాష్ట్ర‌మైన ఏపీకి క‌ష్ట‌మొస్తే మాత్రం సెల్ఫిష్‌గా మారిపోయి త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా కామ్‌గా ఉన్నారు. మ‌రి ఈ ముగ్గురు హీరోలు ఇక ముందైనా స్పందిస్తారో.. లేక త‌మ ప‌ని తాము చూసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments