టాలీవుడ్ నయా త్రయం మళ్ళీ ఒక్కటయ్యారు… ఎందుకో తెలుసా..?

Wednesday, April 25th, 2018, 09:30:44 PM IST

టాలీవుడ్ న‌యా త్ర‌యం రామ్ చ‌ర‌ణ్‌, జూనియర్ ఎన్టీఆర్, మ‌హేష్ బాబు ఇటీవ‌ల‌ భ‌ర‌త్ అనే నేను చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య ఏర్పాటు చేసిన పార్టీలో క‌లిసిన సంగ‌తి తెలిసిందే. హోట‌ల్‌లో ముగ్గురు స్టార్ హీరోలు క‌లిసి ఫోటోల‌కి ఫోజులివ్వ‌గా ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక నిన్న సాయంత్రం టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌పై చిరంజీవి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశానికి కూడా ఈ ముగ్గురు హాజ‌ర‌య్యారు. వీరితో పాటు అల్లు అర్జున్, నాగ చైతన్య, నాని, అల్లు అరవింద్, నాగబాబు, పీవీఎస్సెస్ ప్రసాద్‌, జీవితా రాజశేఖర్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నట్లు సమాచారం. భేటి త‌ర్వాత ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ని ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఫుల్ వైర‌ల్ అవుతుంది. ముగ్గురు స్టార్ హీరోల మ‌ధ్య ఉన్న ఈ బాండింగ్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉండ‌గా, ఎన్టీఆర్‌.. త్రివిక్ర‌మ్ సినిమా సెకండ్ షెడ్యూల్‌కి రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్‌గా భ‌ర‌త్ అనే నేను చిత్రంతో మంచి విజ‌యం సాధించిన మ‌హేష్‌..వంశీ పైడిప‌ల్లి సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments