‘తూఫాన్’ ప్లెక్సీని తగలబెట్టిన సమైక్యాంద్ర ఉద్యమకారులు

Wednesday, August 28th, 2013, 03:51:15 PM IST


సీమాంద్ర ఉద్యమ సెగ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ జంజీర్/ తూఫాన్’ సినిమాకి తగిలింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సమైక్యాంద్రకు మద్దతుగా రాజీనామా చేయకపోవడంతో ఈ రోజు రామ్ చరణ్ నటించిన తూఫాన్ సినిమా ఫ్లెక్సి ని విజయనగరం జిల్లాలోని కోట జంక్షన్ వద్ద సిమాంద్ర ఉద్యమకారులు తగులబెట్టారు. అయితే ఈ మద్య రామ్ చరణ్ ఒక వార్త ఏజెన్సీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘అమితాబచ్చన్ నటించిన పాత్రపై అందరికి భారీగా అంచనాలు ఉంటాయని ఈ సినిమాని నేను చెయ్యలా వద్ద అని అనుకుంటున్నా సమయంలో తన తండ్రి చిరంజీవి దైర్యం చెప్పి ‘ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఏమి ఆలోచించకుండా జంజీర్ లో నటించు అని ప్రోత్సహించాడని రామ్ చరణ్ చెప్పాడు.