జగన్ కేబినెట్‌లో ఆ ఇద్దరే టాప్.. కారణం అదేనా..!

Saturday, December 14th, 2019, 09:01:53 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. అయితే ఈ ఆరు నెలలలో జగన్ పాలనపై అటు పార్టీలో, ప్రజలలో మంచి స్పందనే కనిపిస్తుంది. అయితే జగన్‌తో పాటు ఆయన కేబినెట్‌లోని మొత్తం 25 మంది మంత్రులపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఏ మంత్రి బెస్ట్ అన్న దానికి ఓ ఇద్దరి పేర్లు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఏపీ కేబినెట్‌లో ఉన్న మంత్రులలో కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లు ఈ మధ్య బలంగా వినిపిస్తున్నాయి.

అయితే మంత్రులు కాకుండా ఎమ్మెల్యేలలో రోజా, అంబటి రాంబాబు వంటి వారు మీడియాలో చంద్రబాబు, టీడీపీ, జనసేనకు భారీగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇకపోతే పార్టీ పరంగా విజయసాయి రెడ్డి ప్రధాన పాత్ర పోశిస్తున్నారు. అయితే జగన్ కేబినెట్‌లో ప్రతిపక్షానికి దీటుగా కౌంటర్లు ఇస్తూ, చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టడంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చురుకుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అసెంబ్లీ బయట బొత్స విపక్షాలకు కౌంటర్లు ఇస్తుంటే, అసెంబ్లీ లోపల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మార్క్ సెటైర్లతో టీడీపీపై విరుచుకుపడుతున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారట. ఏదేమైనా ఇప్పటివరకు ఈ ఇద్దరు వైసీపీలో టాప్2లో కొనసాగుతున్నారని సొంత పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.