ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలీవుడ్ భామ సిద్దం…

Thursday, March 22nd, 2018, 02:24:03 PM IST

కొద్దికాలం నుంచి పెద్ద డైరెక్టర్లు అందరు బయో పిక్ లమీద పడుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్ ఏంటంటే ఎన్టీఆర్ అని స్పెషల్ గా చెప్పనవసరంలేదు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో ఎన్టీఆర్ టైటిల్‌తో బ‌యోపిక్ రూపొంద‌నుంది. అయితే ఈ మూవీ స్ట్రిప్ట్ వ‌ర్క్ ఇప్ప‌టికే పూర్తి కాగా, త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ళాల‌ని తారా స్థాయిలో ప్రక్రియలు సిద్దం చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించిన న‌టీన‌టుల‌ని ఎంపిక చేసే ప‌నిలో టీం ఉంది. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ విద్యా బాల‌న్‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆమెకి స్టోరీ న‌రేట్ చేసిన చిత్ర యూనిట్‌, డెసిష‌న్ కోసం వెయిట్ చేస్తున్నార‌ని తెలుస్తుంది. విద్యాబాల‌న్ ఇప్ప‌టికే ప‌లు బ‌యోపిక్స్‌లో న‌టించ‌గా, శ్రీదేవి బ‌యోపిక్‌లోను ఈ అమ్మ‌డినే తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. సాయి కొర్ర‌పాటి మ‌రియు విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి సంయుక్తంగా నిర్మించ‌నున్న ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ప్ర‌తి ఒక్క‌రిలోను ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి డీటైల్స్ వెల్ల‌డించ‌నున్నారు. ఇక విద్యాబాలన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చ్జిందటే అభిమానులు పండగ చేస్కున్నట్టే…