హైద‌రాబాద్‌లో టాప్ సెల‌బ్రిటీ ట్రైన‌ర్ ఈవిడే?

Wednesday, February 28th, 2018, 11:29:40 PM IST

సెల‌బ్రిటీలు ప్ర‌త్యేకించి ఫిట్‌నెస్‌లో శిక్ష‌ణ అవ‌స‌రం ఉంటుంది. ఈరోజుల్లో సామాన్యులు సైతం ఎంతో శ్ర‌ద్ధ‌గా ఫిట్‌నెస్ కోసం జిమ్ముల‌ను ఆశ్ర‌యిస్తున్న‌ప్పుడు కోట్ల‌కు కోట్లు ఆదాయం ఆర్జించే సెల‌బ్స్ ఆమాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ఉంటారా? అందుకే ప్ర‌స్తుతం ఫిట్‌నెస్ ట్రైన‌ర్ల‌కు టాలీవుడ్‌లో గిరాకీ పెరుగుతోంది. హైద‌రాబాద్‌లో నాజ్ ఇనిస్టిట్యూట్ గురించి తెలియ‌నివారు ఉండ‌రు. అయితే ముంబై టు హైద‌రాబాద్ టాప్ సినిమా సెల‌బ్రిటీల‌కు ఫిట్‌నెస్ ట్రైన‌ర్ గా కొనసాగుతున్న రుహీ నాజ్ గురించి తెలుసుకుని తీరాలి.

యోగా గురూ భ‌ర‌త్ ఠాకూర్ భార్య‌, మేటి క‌థానాయిక భూమిక‌కు శిక్ష‌ణనిచ్చింది రూహీ నాజ్‌. అంతేకాదు.. బాహుబ‌లి సినిమా టైమ్‌లో ప్ర‌భాస్‌, త‌మ‌న్నాల‌కు రుహీ నే శిక్ష‌ణ‌నిచ్చారుట‌. యోగాలో ప్ర‌త్యేకించి వీళ్లంద‌రికీ టిప్స్ ఇచ్చారుట‌. ఇలియానాకు రుహీనే ట్రైన‌ర్‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో అపోలో లైఫ్ స్టూడియో పేరుతో యోగా & జిమ్‌ సెంట‌ర్ ని రుహీ ర‌న్ చేస్తున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, యోగా కోసం సంప్ర‌దించాల్సిందిగా రూహీ ఇచ్చిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.