కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్న డైరెక్ట‌ర్‌?

Wednesday, April 18th, 2018, 08:56:16 PM IST

కుమారుని స్టార్ హీరోని చేయ‌డ‌మే ధ్యేయంగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ పావులు క‌దుపుతున్నాడు. త‌న కెరీర్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్న క్ర‌మంలో ఇత‌ర స్టార్ హీరోలు త‌న‌కు అవ‌కాశాలు ఇవ్వ‌ని స‌న్నివేశంలో పూరి ఓ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌యుడు ఆకాష్ పూరితో `మెహ‌బూబా` చిత్రంతో రీలాంచ్ చేయ‌డం గొప్ప డేరింగ్ ఫీట్‌. ఈ సినిమా తెర‌కెక్కించ‌డం వెన‌క బోలెడంత మెలోడ్రామా న‌డిచింద‌ని చెబుతున్నారు.

అస‌లే ఫ్లాపుల్లో ఉన్న పూరిని న‌మ్మి పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రు ముందుకొస్తారు? ఆ క్ర‌మంలోనే అత‌డు త‌న సొంత ఇంటిని అమ్ముకున్నార‌ట‌. త‌నకు ఉన్న ఇళ్ల‌లో ఒక‌ పాత ఇంటిని అమ్ముకుని వ‌చ్చిన 21 కోట్ల‌ను `మెహ‌బూబా`పై పెట్టుబ‌డి పెట్టారు. మేలో ఈ సినిమా రిలీజ్‌కి వ‌స్తోంది. అయితే మెహ‌బూబాకు రిట‌ర్న్స్ ఎలా? అంత పెద్ద రిస్క్ చేసిన పూరికి డ‌బ్బు తిరిగి వ‌స్తుందా? అంటూ అంద‌రిలో ఒక‌టే సందేహం. అయితే పూరి వేసిన స్కెచ్ ముందు అన్ని సందేహాలు ప‌టాపంచ‌ల‌య్యాయి. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న పూరి సినిమాని నిజంగానే పంపిణీదారులెవ‌రూ కొనేందుకు సాహ‌సించ‌లేదు. అలాంటి టైమ్‌లో ఆప‌ద్భాంద‌వుడిలా దిల్‌రాజు ఆరంగేట్రం చేశాడు. అత‌డికి పూరి కాంపౌండ్ మెహ‌బూబా ప్రీ ప్రివ్యూని చూపించిందిట‌. ట్రైల‌ర్‌తోనే ఇంప్రెస్ అయిపోయిన రాజుగారు, సినిమాతో ఇంకా ఫిదా అయిపోయార‌ట‌. మెహ‌బూబా ష్యూర్‌షాట్ హిట్ అని భావించిన ఆయ‌న‌ ఆ సినిమాకి సంబంధించి ఏపీ, నైజాం హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. ఇక ఇల్లు అమ్ముకున్న డ‌బ్బు వ‌చ్చేసింది. పైగా పూరికి లాభాలు వ‌చ్చాయిట‌. అంతేకాదు అలా వ‌చ్చిన డ‌బ్బుతో ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లోనే ప్ర‌ధాన‌మైన ఏరియాలో మ‌రో కొత్త ఇల్లు క‌ట్టేందుకు ప్లాన్ వేస్తున్నాడ‌ట‌. పూరీనా మ‌జాకానా?

  •  
  •  
  •  
  •  

Comments