పూరి కోసం మొత్తం లుక్ నే మార్చిన రామ్ ?

Monday, November 7th, 2016, 10:36:03 AM IST

raam
ఇటీవలే ”నేను శైలజ” సినిమాతో మంచి హిట్ అందుకున్న రామ్ కు లెటస్ట్ గా వచ్చిన ”హైపర్” పెద్దగా సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. ఓ మోస్తరు హిట్ తో సరిపెట్టుకున్న రామ్ నెక్స్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. ఇక పూరి జగన్నాధ్ సినిమాలో హీరోలు ఎలా ఉంటారో .. ఎలా ప్రవర్తిస్తారో అందరికి తెలుసు. ఆయనతో సినిమాలు చేసిన ప్రతి హీరో .. మ్యాన్లీ గా మారిపోవలసిందే. ఇటీవలే సాఫ్ట్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న కళ్యణ్ రామ్ కూడా ఇజంతో పూరి స్టైల్ హీరోగా మారిపోయాడు. ఇక ‘ఇజం’ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది. గత కొన్ని రోజులుగా సరైన హిట్ కొట్టాలనే కసితో ఉన్న పూరి కి హిట్ మాత్రం అందని ద్రాక్ష లా మారింది !! మరి రామ్ తో అయినా పూరికి మంచి బ్రేక్ వస్తుందేమో చూడాలి ? అన్నట్టు ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయట !!