టీజర్ : టచ్ చేసి చూడు.. మాస్ రాజ్ యాక్షన్ టచ్!

Saturday, January 6th, 2018, 12:54:05 PM IST

‘టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. హీరోలో ఎంత పవర్ వున్నది’ అనే లైన్ తో వస్తోన్న ‘టచ్ చేసి చూడు’ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ కెరీర్ లో మరో హిట్ అందుకోవడం గ్యారెంటీ అని టీజర్ చెప్పకనే చెప్పింది. యాక్షన్ సీన్స్ ప్రధానంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాస్ రాజా సరికొత్తగా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంది. రవితేజ్ అభిమానులు సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నాట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చాలా పవర్ప్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ సినిమాలో అదరగొట్టాడని చిత్ర యూనిట్ కూడా చెబుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో సినిమాను రిలీజ్ చేయాలనీ చిత్ర నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవి తేజ సరసన రాశి ఖన్నా – సీరత్ కపూర్ నటించారు.