రివ్యూ రాజా తీన్‌మార్ : టచ్ చేసి చూడు – టచ్ చేశారో.. మీ ఇష్టం

Saturday, February 3rd, 2018, 09:45:53 AM IST

 

తెరపై కనిపించిన వారు : రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్

కెప్టెన్ ఆఫ్ ‘టచ్ చేసి చూడు’ : విక్రమ్ సిరికొండ

మూల కథ :

అన్నిటికన్నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కార్తికేయ (రవితేజ) పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీఖన్నా)ను ప్రేమిస్తాడు. కానీ కొన్ని చిన్న చిన్న సమస్యల వలన ఆమె అతన్ని దూరం పెడుతుంది. అలా వారి ప్రేమ కథ సాగుతుండగా కార్తికేయ చెల్లెలు ఒక హత్యను చూసి సాక్ష్యం చెబుతానని ముందుకొస్తుంది.

ఆమెకు రక్షణగా నిలిచే ప్రయత్నంలో తన చెల్లెలు చూసిన హంతకుడు గతంలో తాను పోలీసాఫీసర్ గా ఉన్నప్పుడు డీల్ చేసిన ఒక కేసులో నిందితుడని తెలుసుకుని అతన్ని అంతం చేసేందుకు తిరిగి పోలీస్ గా మారుతాడు. అసలు కార్తికేయ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, ఆ క్రిమినల్ గతంలో అతన్నుండి ఎలా తప్పించుకున్నాడు, తిరిగి ఉద్యోగంలో చేరిన కార్తికేయ అతన్ని ఎలా అంతం చేశాడు అన్నదే సినిమా.

విజిల్ పోడు :

–> సినిమా ఫస్టాఫ్ రవితేజ, రాశీఖన్నాల లవ్ ట్రాక్, మధ్యలో వచ్చే చిన్న చిన్న కామెడీ సీన్స్ తో కొంతమేర చూదగిన విధంగానే ఉండి ఎంటర్టైన్ చేసింది. కాబట్టి మొదటి విజిల్ ఆ సినిమాకే వేయాలి.

–> హీరో రవితేజ చాలా రోజుల క్రితం వదిలేసినా తన ఫన్నీ మ్యానరిజాన్ని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఎవ్వరినీ లెక్కచేయని పోలీస్ అధికారి పాత్రలో కూడా బాగానే కనిపించి సినిమాను ముందుకుతీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కనుక రెండో విజిల్ ఆయనకే వేయాలి.

–> ఇంటర్వెల్ బ్లాక్ మంచి యాక్షన్ ఎపిసోడ్ తో నిండి అలరించింది. సినిమలో రెండు పాటలు బాగున్నాయి. మణిశర్మ నైపత్య సంగీతం బాగుంది. వీటన్నిటికీ కలిపి మూడో విజిల్ వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> దర్శకుడు విక్రమ్ సిరికొండ వక్కంతం వంశీ వద్ద నుండి తీసుకున్న కథ చాలా పాతదిగా ఉంది. అందులో ఎక్కడా కొత్తదనమే కనబడలేదు.

–> ఇక కథనం కూడా పాత పంథాలోనే నీరసంగా నడుస్తూ ప్రేక్షకుడికి కావాల్సినంత నిరుత్సాహాన్ని అందించింది.

–> క్లైమాక్స్ కూడా సిల్లీగా, హడావుడిగా ముగియగా ప్రతినాయకుడి పాత్ర తేలిపోయి సినిమాలో దమ్ము లేకుండా చేసింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ చిత్రంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయాలేమీ లేవు.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : అబ్బా.. సెకండాఫ్ కొద్దిగా బాగుంటే బాగుండేది.
మిస్టర్ బి : బాగుంటే అన్నీ బాగానే ఉంటాయ్. బాగాలేకనే కదా ఈ బాధంతా.
మిస్టర్ సి : సర్ సినిమా ఎలా ఉంది ? చూడొచ్చా ?
మిస్టర్ బి : ఏం నెక్స్ట్ షోకి వెళ్తున్నారా ?
మిస్టర్ సి : లేదండి.. బాగుందంటే పోదామని
మిస్టర్ ఏ : నేనైతే వద్దంటాను. కాదని టచ్ చేశారో.. మీ ఇష్టం

  •  
  •  
  •  
  •  

Comments