సీఎం కేసీఆర్‌ది దుర్మార్గపు పాలన.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం..!

Sunday, May 31st, 2020, 02:00:05 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ కేసీఆర్ దుర్మార్గపు పాలనలో ఎవరికీ గౌరవం లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

అయితే రైతు రుణమాఫీ చేయకుండా శుభవార్త చెబుతా అనడానికి కేసీఆర్‌కి కొంచెమైనా సిగ్గుండాలన్నారు. రైతుబంధు, లక్ష రుణమాఫీ అందలేదని, పంటల బీమా ఊసే లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే సాగు నీరు అందుతుందని అన్నారు.