ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం – లక్షన్నర చలాన్ల మాఫీ

Wednesday, October 16th, 2019, 12:11:01 AM IST

ప్రస్తుతానికి అతిపెద్ద సమస్యగా మారినటువంటి ట్రాఫిక్ చలాన్లతో ప్రజలందరూ కూడా నిత్యం తీవ్రమైన సమస్యలను ఎదుర్కుంటున్న సంగతి మనకు తెల్సిందే. కాగా అలంటి ప్రయాణికులందరికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పేశారు. ఈఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వరకు వాహనదారులపై పట్టుబట్టి విధించిన సుమారు లక్షన్నర చలాన్లను రద్దు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇది అందరికి కాదండోయ్… కేవలం ఢిల్లీ ప్రయాణికులకు మాత్రమే. కాగా నేషనల్ హైవే 24 పై మితిమీరిన వేగం తో వెళ్లిన వాహనదారులకు విధించిన 1.5 లక్షల ఇ- చలాన్లను కొట్టేస్తున్నామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కాగా అనసరంగా చలాన్లు విధిస్తున్నారని, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ప్రయాణిస్తున్నప్పటికి కూడా ట్రాఫిక్ పోలీసులు ఇలా చలాన్లు వేస్తున్నారని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో, ట్రాఫిక్ పోలీసులు వారి చలాన్లను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు.