భారత్‌లో త్వరలో 11 అంకెల మొబైల్ నంబర్ రాబోతుందోచ్..!

Saturday, May 30th, 2020, 01:06:24 AM IST

భారత్‌లో పెరుగుతున్న మొబైల్ వినియోగదారులకు అనుకూలంగా మొబైల్ ఫోన్ నెంబర్లను పెంచడానికి ట్రాయ్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. త్వరలో దేశంలో మొబైల్ ఫోన్ నెంబర్ 11 అంకెలతో వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం మొబైల్ నంబర్లలో 10 అంకెలు ఉండగా దానిని 11 అంకెలుగా పెంచడం వలన మరో పది మిలియన్ల ఫోన్ నంబర్లు అందుబాటులోకి వస్తాయని ఆలోచిస్తుంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న నంబర్లకు ముందు 9 అంకెను జోడించాలని ప్రతిపాదన ఉంది. ఇక లాండ్ లైన్ నుంచి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్‌కు ముందు ‘0’ జోడించే ప్రతిపాదన కూడా చేసింది. అలాగే డాంగిల్స్‌కు వినియోగించే మొబైల్ నెంబర్‌ను 10 అంకెల నుంచి 13 అంకెలకు మార్చే ప్రయత్నం చేస్తుంది.