ట్రైలర్ టాక్ : హుషారెత్తించే కిరాక్ పార్టీ!!

Tuesday, March 13th, 2018, 10:42:08 PM IST


హ్యాపీడేస్ సినిమాతో నలుగురు హీరోల్లో తనకంటూ మంచి పేరు సంపాదించిన నిఖిల్ సిద్దార్థ తరువాత మెలమెల్లగా తన ఓన్ టాలెంట్ తో వైవిధ్యభరిత సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ‘కిర్రాక్ పార్టీ’తో పలకరిస్తున్నాడు. ఈనెల16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మొదలయ్యే ఒక కుర్రాడి ప్రయాణం. కాలేజీలో ర్యాగింగ్, సీనియర్స్ తో గొడవలు, కొట్లాటలు. తొలిసారి సిగరెట్ పఫ్ లాగడం. మందు కొట్టడం, ప్రేమలో పడటం, వయలెంట్ గా తయారవ్వడం.ఆ క్రమంలో జీవిత గమ్యాన్ని అర్ధం చేసుకోవడం.

నిజానికి ఒక్క ట్రైలర్ తో చాలా విషయాలనే గుర్తుకు తెచ్చారు నిఖిల్ అండ్ టీమ్. ప్రతీ షాట్లోనూ ఒక కొత్త తరహాలో ఎనర్జీ. అలాగే ప్రొడక్షన్ విలువల దృష్ట్యా మంచి రిచ్ నెస్ అండ్ ఫ్రెష్నెస్ కనిపిస్తున్నాయి. అలాగే కొత్త భామలు సిమ్రాన్ పరింజా అండ్ సంయుక్త హెగ్డే వారి స్క్రీన్ ప్రెజెన్స్ తో అకట్టుకున్నారు. చూస్తుంటే సమ్మర్లో ఈ కిరాక్ పార్టీ యువతకు మంచి పార్టీలా మారేలా వుంది. కార్తీక్ ఘట్టమనేని ఫోటగ్రాఫి, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్, చందు మొండేటి డైలాగ్స్ బాగున్నాయి.

మొత్తానికి నిర్మాత అనిల్ సుంకర అన్నింటినీ భలే కూర్చారు. హ్యాపీ డేస్ తరువాత మరోసారి ఈ సినిమా కాలేజీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించి విజయం సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనాలు వేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments