ట్రైలర్ టాక్ : నేల టికెట్ – యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్

Wednesday, May 16th, 2018, 07:07:33 PM IST

రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నమాస్ మహారాజ రవితేజ ఆ తరువాత చేసిన టచ్ చేసి చూడు తో మరొక పరాజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన హీరోగా ఇటీవల సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయి వేడుక చూద్దాం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నేల టికెట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర టీజర్ మరియు ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. కాగా నేడు ఈ చిత్ర ట్రైలర్ ను యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఇందులో రవితేజ తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను మిస్ కానట్లు తెలుస్తోంది. పొలిటిషన్ పాత్రలో నటిస్తున్న జగపతి బాబు చిత్రంలో ప్రధాన విలన్ అని అర్ధం అవుతుంది.

కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ ట్రైలర్ లో నేను పైకి రావడానికి ఎవరినైనా తొక్కేస్తాను అని జగపతి బాబు పలికే డైలాగు, నువ్వు రావడం కాదు నేనే వస్తున్నా నేను వచ్చేవరకు అదే మూడ్ మైంటైన్ చేయి, అలానే నేలటికెట్ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అని రవితేజ పలికే డైలాగులు అలరిస్తాయి. మొత్తానికి ట్రైలర్ త్వరలో విడుదల కానున్న చిత్రంపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. కాగా రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మే 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం కింద ఇచ్చిన లింక్ లో మీరు కూడా ట్రైలర్ చూసి ఆనందించండి మరి……