ట్రైలర్ టాక్ : రాజుగాడు – మంచి నవ్వులు పంచాడు!

Friday, May 11th, 2018, 06:24:27 PM IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా అమైరా దస్తూర్ హీరోయిన్ గా సుంకర రామబ్రహ్మం నిర్మాతగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సంజన రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం రాజుగాడు. ఇటీవల విడుదలయిన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. కాగా నేడు రాజ్ తరుణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ ట్రైలర్ ను విడుదలచేసింది. ఇదివరకు టీజర్ లోనే దర్శకురాలు చిత్ర థీమ్ చెప్పేయడం జరిగింది. హీరో తనకు తెలియకుండానే హీరో దొంగతనాలు చేస్తూ ఉండడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని అర్ధమవుతుంది. కాగా నేడు విడుదలయిన ట్రైలర్ ను బట్టి చూస్తే చిత్రం ఆద్యంతం మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందనిపిస్తోంది.

అంతే కాదు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రాజ్ తరుణ్ కంబినేషన్ లో ఇదివరకు వచ్చిన అంధగాడు చిత్రం పెద్దగా ఆడనప్పటికీ వారి మధ్య జరిగే కామెడీకి మంచి పేరొచ్చింది. అలానే ఈ చిత్రంలో కూడా వారి మధ్య సన్నివేశాలు మంచి ఎంటెర్టైనింగా ఉండవచ్చు. ట్రైలర్ మధ్యలో హీరో హీరోయిన్ తో మాట్లాడుతూ ఎవడైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఆమె కళ్ళలోకి చూస్తాడు, నాకేంటో ఆమె గొలుసు, చెవిదుద్దులవైపు చూడాలనిపిస్తుంది అని చెప్పడం బాగుంది. అలానే భోజనం కోసం చిన్న దొంగతమ్ చేసిన దొంగని నాగినీడు చితకొట్టిన సన్నివేశం, అలానే రైస్ మిల్ లో రాజ్ తరుణ్ ఫైట్ ని బట్టి చిత్రంలో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో నా ఫోన్ మీకెలా దొరికింది అని హీరోయిన్ అడగ్గా, ఇది జస్ట్ ట్రైలర్, మీకు మంచి బెనిఫిట్ షో వేసి ఫుల్ మూవీ చూపిస్త అని పలికిన డైలాగులు ఫన్నీగా అనిపిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ చిత్రం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ పై ఒక లుక్ వేయండి..

  •  
  •  
  •  
  •  

Comments