ట్రైల‌ర్ టాక్ : `ప్రేమ‌మ్‌` హీరో మ‌రో హిట్ గ్యారెంటీ

Sunday, March 18th, 2018, 12:20:27 PM IST

కాలేజ్ ఏజ్‌లో ఎలా ఉంటుంది? అస‌లే టీనేజీ.. అటుపై క‌వ్వింత‌.. తుల్లింత‌.. ఆ వ్య‌థ అనుభ‌వించేవాడికే తెలుస్తుంది. ఓవైపు బండెడు పుస్త‌కాలు చ‌ద‌వాలి.. ర్యాంకులు కొట్టాలి. క‌ళ్ల ముందే మెరుపులెన్నో క‌వ్వించి వెళ్లిపోతున్నా కెరీర్ భ‌యం వెన్నాడుతూ ఉంటుంది. ఎప్పుడో ఓసారి పిక్నిక్‌ వ‌గైరా వెళ్లిన‌ప్పుడు త‌ప్ప ఇత‌ర స‌మ‌యాల్లో పెద్దంత‌గా డేర్ చేసి గాళ్స్‌తో మాట్లాడే స‌న్నివేశం ఉండ‌దు. ప్రాక్టిక‌ల్స్‌లో రికార్డ్ పేరుతో ఓ మాట త‌ప్ప ఇంకేమీ ఉండ‌దు. వెర‌సి ఈ జ్ఞాప‌కాల‌న్నీ మ‌దిలో దాచుకుని ఆన‌క కాలేజ్ లైఫ్ దాటిపోయాక‌.. వాటిని గుర్తు చేసుకునేవాళ్లే మెజారిటీ భాగం ఉంటారు. అయితే ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ మారింది. కాలేజ్ అంటే ల‌వ్ క్ల‌బ్బుల్లా మారాయి. ఏదో ఒక‌టి కాలేజీలోనే తేల్చుకునే టైపు ఇప్పుడంతా!

అక్క‌డే వ‌చ్చింది చిక్కు.. అలా కాలేజ్ నుంచి టూర్‌కి జంపైన 19 వ‌య‌సు కాలేజ్ కుర్రాళ్ల‌లో న‌లుగురి ల‌వ్‌ లైఫ్ ఎలా సాగింది? అటుపై స‌న్నివేశాల స‌మాచారం ఏంట‌నేది.. తెర‌పై చూడ‌మ‌ని .. చివ‌రిలో థ్రిల్లిచ్చే ఎండింగ్‌ని చూపించారు ట్రైల‌ర్‌లో. ఇదంతా `ఆనందం` ట్రైల‌ర్ గ్లింప్స్ గురించే. ప్రేమ‌మ్ హీరో నివిన్ పాళీ న‌టించిన ఈ సినిమా మ‌రో `ప్రేమ‌మ్‌` రిజ‌ల్ట్‌ని తేవ‌డం గ్యారెంటీ అన్న టాక్ వినిపిస్తోంది.