ట్రైల‌ర్ టాక్‌ : తిమింగ‌ళం రాక్ష‌స‌త్వం!

Tuesday, April 10th, 2018, 09:09:53 PM IST


3డి సినిమాలు త‌డాఖా చూపిస్తున్న టైమ్ ఇది. మునుముందు మ‌రింత అధునాత‌న టెక్నాల‌జీ అందుబాటులోకొస్తోంది. అంత‌కంత‌కు సినిమా వ్యూయింగ్ విధానం పూర్తిగా మారిపోతోంది. 3డి, ఐమ్యాక్స్ 3డి విధానం ప్రేక్ష‌కుల‌కు పిచ్చిగా న‌చ్చుతోంది. అందుకే ఈ త‌ర‌హా సినిమాల‌కు రెవెన్యూ అదే రేంజులో ఉంటోంది. ఇటీవ‌లే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన బ్లాక్ పాంథ‌ర్ చిత్రం ఇండియా నుంచి భారీగా వ‌సూళ్లు సాధించింది. వ‌ర్చువ‌ల్ రియాలిటీ బేస్డ్ క‌థాంశంలో ఐమ్యాక్స్ 3డి వ్యూయింగ్ గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఆ క్ర‌మంలోనే మునుముందు రిలీజ్‌ల‌కు రెడీ అవుతున్న 3డి సినిమాలేంటి? అన్న‌ది అభిమానులు అదే ప‌నిగా అంత‌ర్జాలంలో వెతుకుతున్నారు.

ఆ క్ర‌మంలోనే ఇదిగో మ‌రో వండ‌ర్‌ఫుల్ మూవీ ఇండియా థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. `ది ఎంఇజి-3డి` అనేది సినిమా టైటిల్‌. హాలీవుడ్ మేటి యాక్ష‌న్ క‌థానాయ‌కుడు జాస‌న్ స్టాథ‌మ్ న‌టించిన‌, ఈ చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌క వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ సంస్థ ఇండియాలోనూ రిలీజ్ చేస్తోంది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ విజువ‌ల్ ఫీస్ట్‌. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ల‌లో మ‌రో కొత్త స్థాయిని చూపించే సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా డీప్ సీలో వేటాడే తిమింగ‌ళంని ఈ సినిమాలో చూపిస్తున్నారు. చైనా స‌ముద్ర తీరానికి 200 మైళ్ల దూరంలో `మ‌న వ‌న్ రీసెర్చ్ స్టేష‌న్‌`లో ప్ర‌యోగాల క‌థేంటి? అస‌లు మ‌నుషుల‌పై, జ‌లాంత‌ర్గాముల‌పై, ఓడ‌ల‌పై తిమింగ‌ళం దాడులు చేయ‌డానికి కార‌ణ‌మేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. ఆగ‌ష్టు 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. త‌ప్ప‌క చూసి తీరాల్సిన ఆసక్తిక‌ర ట్రైల‌ర్ ఇది.

  •  
  •  
  •  
  •  

Comments