ట్రెండింగ్ : రికార్డు వ్యూస్ దిశగా ‘భరత్ అను నేను’ ట్రైలర్

Sunday, April 8th, 2018, 03:51:01 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకులు కొరటాల శివ దర్శకత్వం లో వస్తోన్న కొత్త సినిమా భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమాలోని పాటలు శ్రోతల నుండి విశేష ఆదరణ పొందాయి. అయితే నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో ప్రీ రిలీజ్ వేడుక ఎంతో అట్టహాసంగా జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

అయితే ఆ వేడుకలో సినిమా ట్రైలర్ ని ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. అలా విడుదలయినప్పటి నుండి ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు 3 మిలియన్ వ్యూస్, లక్ష ముప్పై ఒక్కవేల లైకులతో ప్రస్తుతం యుట్యూబ్ లోటాప్ 1 లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రభంజనం చూస్తుంటే ఇప్పటివరకు టాలీవుడ్లో అత్యధిక లైక్ లు పొందిన ది విజన్ అఫ్ భరత్ పేరిట వున్న అత్యధిక లైక్ ల రికార్డును తొందరలోనే అందుకుంటుందని మహేష్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు….