ట్రెండింగ్ : ‘హ్యాట్సాఫ్ ‘ సూపర్ స్టార్ మహేష్ బాబు

Friday, March 23rd, 2018, 04:53:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఆయన గొప్ప మనస్సు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గురించి ఎంతో మంది సెలెబ్రిటీలు ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయాలను బట్టి చూస్తే అది అర్ధమవుతుంది. నిజానికి సెలబ్రిటీలు, అలానే సినిమా స్టార్స్ తో ఫోటో దిగడం చాలామందికి ఇది ఒక కల. ఆ డ్రీమ్ కలగానే మిగిలిపోయే వాళ్లు కొందరు అయితే, మరికొందరు ఏదోవిధంగా ప్రయత్నించి చివరికి ఆ కలను నిజం చేసుకుంటారు. అయినా మహేష్ బాబు లాంటి అందగాడు, పైగా సూపర్ స్టార్ కూడా, అటువంటి ఆయనతో ఫోటో దిగాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి.

కానీ అది తీరేదెలా అన్నదే మెయిన్ పాయింట్. గత కొద్దీ రోజులుగా భరత్ అనే నేను షూటింగ్ లో బిజీగా గడుపుతున్న మహేష్ బాబు, అభిమానులకు కొంత సమయం కేటాయించి వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు. అందులో భాగంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు కూడా మహేష్ కు వీరాభిమాని. చాలాకాలంగా మహేష్ బాబుతో ఫోటో ఆపర్చునిటీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. అదే ఆశలతో మహేష్ ను సంప్రదించాడు. చివరిగా అవకాశం రావడంతో తన తండ్రితో కలిసి మహేష్ బాబును కలిశాడు ఈ కుర్రాడు. మహేష్ ని కేవలం ఓ సెల్ఫీ కావాలని అడడగా, ఆ కుర్రాడిని చూసి చెలించిపోయిన సూపర్ స్టార్, వాళ్ల ఫోన్ లోనే ఫోటో దిగే సమయాన్ని కేటాయించారు.

అంతే కాదు, ఆ కుర్రాడి భుజంపై చేయి వేసి మరీ ఫోటో దిగి తన గొప్పతనాన్ని మరొకసారి చాటుకున్నారు మహేష్. అంతే ఆ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఉండలేకపోయాడు ఆ బాలుడి తండ్రి. ఇవాళ తన కొడుకు కల నెరవేరిందని, ఫోటో తీసుకునే అవకాశం సమయం కేటాయించిన మహేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడాయన. ఇంత సింపుల్ గా ఉండే సూపర్ స్టార్ మన తెలుగులో ఉండడం మనం గర్వించాల్సిన విషయం అని ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘హ్యాట్సాఫ్ సూపర్ స్టార్’ అని మహేష్ బాబు పై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు…..