ట్రెండింగ్ : భరత్ బహిరంగసభకు ప్రేమతో ఎన్టీఆర్

Friday, April 6th, 2018, 05:39:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సక్సెస్ఫుల్ దర్శకులు కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న కొత్త సినిమా భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా లోని మూడు పాటలు శ్రోతలనుండి మంచి స్పందన పొందాయి. నిన్న చిత్ర యూనిట్ విడుదల చేసిన వచ్చాడయ్యో సామి పాటకు మహేష్ బాబు అభిమానులేకాక సాధారణ ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు. అయితే రేపు ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను భరత్ బహిరంగ సభ పేరిట హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తొలుత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నారని పలు పుకార్లు షికార్లు చేశాయి.

కాగా ప్రస్తుతం ఈ విషయమై నేడు సినిమా యూనిట్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ వస్తున్నారని యూనిట్ కన్ఫర్మ్ చేసింది. కాగా ఈ ఇద్దరు నటులను ఒకే వేదిక మీద చూద్దామనుకున్న ఇద్దరు హీరోల అభిమానుల కల రేపు తీరనుంది అనమాట. ఇదివరకు మహేష్ బాబు, ఎన్టీఆర్ శ్రీనువైట్ల కంబినేషన్ లో వచ్చిన బాద్షా సినిమాకి వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. కాగా కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈనెల 20న విడుదల కానున్నది….

  •  
  •  
  •  
  •  

Comments