ట్రెండింగ్ న్యూస్ : భరత్ బహిరంగ సభ ఖరారు!

Sunday, April 1st, 2018, 06:36:10 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అయన సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. అయితే ఇప్పటికే విడుదలయిన ఈ సినిమాలోని ఫస్ట్ ఓత్, ది విజన్ ఆఫ్ భరత్, అలానే మొన్న విడుదలయిన ది సాంగ్ అఫ్ భరత్ యూట్యూబ్ లో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు. ది విజన్ ఆఫ్ భరత్ అయితే ఏకంగా ప్రపంచంలోని అత్యధిక లైక్ లు పొందిన రెండవ టీజర్ గా ప్రపంచ రికార్డు సాధించిన విషయం తెలిసిందే.

అయితే నేడు ఈ సినిమాలోని ఐ డోంట్ నో అనే పాటను చిత్ర బృందం విడుదల చేయగా అదికూడా యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. మరి అది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా అంటే. అయితే నేడు ఆ చిత్రం యూనిట్ ఫాన్స్ కు మరొక శుభవార్త అనౌన్స్ చేసింది. అదేంటంటే భరత్ అను నేను ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఏప్రిల్ 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా విడుదల చేస్తున్నట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది. అయితే తొలుత ఈ వేడుకను విజయవాడ, అమరావతి లలో జరుగుపుతారని అందరూ అనుకున్నారు. కానీ చివరికి యూనిట్ హైదెరాబాద్ లో జరుపనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హీరో, హీరోయిన్ల పై పాత చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్లారు. వారు తిరిగి రాగానే ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా విడుదలకు ముందే ఇన్ని సంచలనాలు నమోదుచేస్తున్న ఈ సినిమా రేపు విడుదల తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలుకొండుతుందో చూడాలి మరి……