ట్రెండింగ్ న్యూస్ : కొరటాల, మహేష్ నిజంగానే రైట్స్ కొనుగోలు చేశారా ??

Tuesday, March 27th, 2018, 08:01:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, మరియు ఫాలోయింగ్ గురించి చెప్పడం, అంచనా వేయడం అసాధ్యం. హిట్ లు ప్లాప్ లకు అతీతంగా ఆయన క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అంతేకాదు ఆ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నా సినిమాలు హిట్ అయినపుడు కంటే ప్లాప్ అయినప్పుడే తదుపరి చిత్రాలకు మరింత క్రేజ్ వస్తోంది అని ఆయన చెప్పకనే చెప్పారు. శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు ఘోర పరామజయం అయినప్పటికీ ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త సినిమా భరత్ అనే నేను. శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ ఓత్, ఫస్ట్ విజన్, ది సాంగ్ అఫ్ భరత్ లు సంచలనాలు నమోదు చేశాయి. అందులో ముఖ్యంగా ఇటీవల విడుదలయిన ది సాంగ్ అఫ్ భరత్ అయితే ప్రపంచంలోనే అత్యధిక లైక్ లు పొందిన రెండవ టీజర్ గా నిలిచింది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా అంటే. ఇక త్వరలో పూర్తిస్థాయి ఆడియో విడుదల కానుంది.

అసలు విషయం ఏమిటంటే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పై నమ్మకంతో సినిమా నైజాం రైట్స్ ను దర్శకులు కొరటాల శివ దక్కించుకున్నారని, అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొన్ని ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారని ఫిలిం నగర్ టాక్. అయితే నిజానికి ఈ సినిమాకి సంబంధించి రైట్స్ కోసం పలు డిస్ట్రిబ్యూటర్లు పెద్దమొత్తం ఆఫర్ చేసినప్పటికీ, సినిమా మీద పూర్తి నమ్మకంతోనే వారిరువురు ఆ రైట్స్ దక్కించుకున్నారని, అందుకే నిర్మాత దానయ్య కూడా బయటివారికి అమ్మలేదని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఇందులో నిజం లేకపోలేదని అంటున్నారు కొందరు. అయితే ఏది నిజమో తెలియాలంటే యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావలసిందే మరి…..