ట్రెండింగ్ న్యూస్ : మెగాస్టార్ అలా చేయకుండా ఉండాల్సింది!

Friday, March 30th, 2018, 04:28:15 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి అద్భుత తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం రోజునుండి అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేపింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ షూటింగ్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు దొర్లిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

నిజానికి అమితాబ్ తన లుక్, మరియు చిరంజీవి మరియు నయనతారల లుక్ ని తన అధికారికి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అయితే ఈ సినిమాలోని చిరు, నయన్ అలానే అమితాబ్ లుక్ లను ముందుగానే రిలీజ్ చేసి కాస్త తొందరపడ్డారని, ఆలా కాకుండా బాహుబలి మాదిరి ఒక్కొక్కరిగా క్యారెక్టర్స్ తాలూకు లుక్స్ విడుదల చేసివుంటే బాగుండేదని, ఇలా ముందే విడుదల చేయడం వల్ల సినిమా పై ప్రేక్షకుల్లో వుండే క్రేజ్ కొంతవరకు తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి విడుదలయిన ఈ స్టిల్స్ మెగా ఫాన్స్ ను ఖుషి చేస్తున్నాయి….