ట్రెండింగ్ వీడియో : కొత్త యాడ్ లో కుమ్మేసిన మహేష్ బాబు!

Thursday, March 29th, 2018, 11:54:37 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, ఫాలోయింగ్ నిజంగా అద్భుతమని చెప్పాలి. నిజానికి ఆయన చేసే సినిమాలు చాలావరకు చిన్నవయసు వారి నుండి కురు వృద్దులవరకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అంతే కాదు ఎంతటి వారినైనా తన అందం, అభినయంతో సూపర్ స్టార్ తన అభిమానిగా మార్చుకుంటారు. అది మహేష్ బాబు పవర్. అయితే ఆయన ఓ వైపు సినిమాల్లో బిజీ గా ఉంటూ మరోవైపు యాడ్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండియాలోని కొన్ని ప్రముఖ యాడ్ కంపెనీలు మహేష్ బాబు చేతిలో వున్నాయి.

అలానే రీసెంట్ గా ఆయన లోయెడ్ అనే ఒక ఎసి ల సంస్థకు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మహేష్ బాబు పై తీసిన సరికొత్త యాడ్ ను సంస్థ ప్రతినిధులు విడుదల చేశారు. అందులో మహేష్ బాబు ను చూసిన ప్రతిఒక్కరు ఆయన వయసు రోజు రోజుకు తగ్గుతోందే తప్ప, ఏ మాత్రం పెరగడం లేదు అని అనుకుంటున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం సూపర్ స్టార్ నటించిన ఆ యాడ్ క్రింద వీడియో లింక్ లో మీరు చూసెయ్యండి….