ట్రెండింగ్ వీడియో : రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్

Thursday, March 22nd, 2018, 06:12:00 PM IST

బాహుబలి సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి ఏమి సినిమా తీస్తారు, ఎవరితో తీస్తారు అనేది చాలా కాలంగా మన తెలుగు వారు మాత్రమే కాదు, యావత్ భారతదేశం లోని సినీ ప్రియులందరి చర్చ కూడా ఇదే. అయితే దానికి సంబందించి అసలు వార్త నేడు అధికారికంగా బయటకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో లు గా రాజమౌళి ఈ సినిమాను తీస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ, నేడు అది నిజం అని అధికారికంగా తేలింది.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ కు సంబందించిన వీడియో ని డివివి సంస్థ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కొద్దీ క్షణాల కిందట విడుదల చేసింది. అయితే ఈ వీడియో లో రాంచరణ్, ఎన్టీఆర్, అలానే రాజమౌళిజ్, ఇతరుల పేర్లు క్లారిటీగా లేకుండా వెరైటీ గా చూపించారు. #RRR పేరుతో ఈ వీడియో రూపొందించాడా జరిగింది. ప్రస్తుతం విడుదలయిన ఈ వీడియో సోషల్ మీడియాలో విరివిగా వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి, సినిమాని ఎపుడు మొదలుపెడతాయారు, అలానే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియవలసి వుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి….