త్రిషను ఆ సినిమా కాపాడినట్టే ?

Thursday, October 4th, 2018, 08:20:39 PM IST

గ్లామర్ భామ త్రిష ఎన్నో రోజుల నుండి మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటికే హర్రర్ ట్రెండ్ లో భాగంగా మోహిని, నాయకి అంటూ రెండుసార్లు ప్రయత్నాలు చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ సారి కాస్త బిన్నంగా ప్రయత్నం చేయాలంటూ 96 అనే టైటిల్ తో సినిమా చేసింది. ఈ టైటిల్ పెట్టడంతో జనాల్లో ఆసక్తి పెరిగింది. జనరల్ గా 69 అని మనం ఎక్కువగా చూస్తుంటాం .. కానీ దానికి రివర్స్ గా 96 పెట్టడం ఏమిటా ? అని దీనికి అర్థం ఏమిటో తెలుసా .. ఎడమొహం .. పెడమొహం అన్నమాట !! విజయ్ సేతుపతి తో జోడికట్టిన త్రిష కు 96 సినిమా మంచి హిట్ ని అందించింది. ఈ రోజు విడుదల అయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. దాదాపు దశాబ్ద కాలం పైగా సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ త్రిష వరుస ఫ్లోప్స్ తో కాస్త గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. ఈ సెకండ్ ఇన్నింగ్ లో కూడా మొదట్లో ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు .. అయినా సరే పట్టు విడవకుండా భిన్నమైన సినిమాలు చేసింది. మొత్తానికి 96తో మంచి విజయాన్ని అందుకుంది.