గట్టిగానే బయపెడతానంటున్న త్రిష ?

Wednesday, January 24th, 2018, 03:10:25 PM IST


సౌత్ క్రేజీ భామ త్రిష కు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన కూడా పెద్దగా కలిసి రావడం లేదు. ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడి సినిమాలు విడుదల విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి. దానికి కారణం ప్రస్తుతం త్రిష కు సరైన మార్కెట్ లేకపోవడాంతో ఈ సినిమా విడుదలకు ఎవరు ముందుకు రావడం లేదట. అయితే ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో హర్రర్ చిత్రం మోహిని. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాతో మళ్ళీ తన క్రేజ్ పెరుగుతుందని నమ్మకంతో ఉన్న ఈ భామ మోహినిగా కచ్చితంగా భయపెడతానని చెబుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాలో త్రిష నటన కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. దాంతో పాటు యాక్షన్ స్టాంట్స్ కూడా చేసిందట. మొత్తానికి మోహిని పై భారీ ఆశలు పెట్టుకున్న త్రిష నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలి.