త్రిషాకు వంద డిగ్రీల జ్వరం పట్టుకుందా ?

Tuesday, September 27th, 2016, 02:56:01 PM IST

trisha
ఏంటి త్రిషా కు వంద డిగ్రీల జ్వరం వస్తే కూడా ఇంత హంగామా చేయాలా? అంటూ షాక్ అవ్వకండి బాస్ …!! అసలు విషయం వింటే మీరే అవునా అంటారు. మాజీ గ్లామర్ భామ త్రిష సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టినప్పటినుండి చేసిన సినిమాలన్నీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ముక్యంగా అందరు వెళ్లే దారిలో వెళ్లి ”నాయకి”తో భయపెట్టి హిట్ కొట్టాలనుకున్నా కూడా ఆమెకు తీవ్ర నిరాశ మిగిలింది. ఇక ఇప్పుడు మరో హర్రర్ సినిమా చేస్తున్న త్రిష ఓ మలయాళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడింది? అది ఏ సినిమానో తెలుసా మలయాళంలో సూపర్ హిట్ గా సంచలనం రేపిన ”100 డిగ్రీ సెల్సియస్”. సంచలన తారా శ్వేతా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా త్రిష కు బాగా నచ్చిందట, నటన, గ్లామర్ రెండు సినిమాకు ప్రధాన అంశాలు కావడం, ఈ సినిమా చేస్తే తనకు మళ్ళీ మంచి క్రేజ్ దక్కడం ఖాయం అనే ఆలోచనలో ఉందట !! అందుకనే ఈ సినిమాను రీమేక్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నది. ఐదు మంది మహిళల జీవితాల చుట్టూ జరిగే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే రూపొందనుంది. అన్నట్టు మరో గ్లామర్ భామ లక్ష్మి రాయ్ ఇప్పటికే ఈ సినిమాలో ఓ పాత్రకు ఓకే చేసినట్టు సమాచారం ?