త్రిష పెళ్ళికి లైన్ క్లియర్ అయ్యిందా ?

Wednesday, May 30th, 2018, 11:32:23 PM IST

దాదాపు దశాబ్దకాలం పాటు సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఓ రేంజ్లో దూసుకుపోయిన గ్లామర్ భామ త్రిష పెళ్ళికి రంగం సిద్ధం అయిందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు ? నిజానికి త్రిష వివాహం ఐదేళ్ల క్రితమే జరగాల్సి ఉంది .. ఓ బిజినెస్ మెన్ ను ప్రేమించిన ఆమె నిశ్చిత్రార్థం కూడా జరిగింది .. ఆ తరువాత ఎందుకో ఆగిపోయింది. ఆ సంగటనతో షాక్ కు గురయిన ఈ అమ్మడు ఇక పెళ్లి చేసుకోనని మొండి పట్టు పట్టింది. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లో బిజీగా చేసిన ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దాదాపు అందరు హీరోలతో నటించిన ఈ అమ్మడికి ఒక్క సూపర్ స్టార్ రజని సరసన మాత్రమే హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు.

తాజగా రజని కాంత్ తో నటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు త్రిష పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజగా విదేశాల్లో భారీ షాపింగ్ చేశారట. నిజానికి అంత రేంజ్ లో షాపింగ్ అంటే అది పెళ్ళికి తప్ప మరో విషయంలో చేయరు .. ఆ షాపింగ్ చూసినవాళ్లు త్రిష పెళ్లికి సిద్ధం అయిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా త్రిష ఓ బిజినెస్ మెన్ తో డీప్ లవ్ లో పడిందని .. ఇద్దరు కలిసి త్వరలోనే వివాహం చేసుకుంటారని కోలీవుడ్ కోడై కూస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments