త్రివిక్రమ్ వీర రాఘవుడికి లీకుల.. షాక్ ?

Tuesday, July 24th, 2018, 02:11:41 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి అప్పుడే లీకేజ్ సమస్య మొదలైంది. తాజాగా ఎన్టీఆర్ , నాగబాబు కు సంబందించిన ఓ యాక్షన్ సన్నివేశానికి సంబందించిన ఫోటో లీకై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దుమారం రేపుతోంది. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 80 శాతం వరకు షూటింగ్ పూర్తీ చేసుకుంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్ కోసం యూరోప్ వెళ్లనున్నారు. అయితే తాజాగా విడుదలైన సీన్ ఫోటో చుస్తే .. ఈ సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉన్నట్టే అని క్లియర్ గా తెలుస్తోంది.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో యాక్షన్ ఓ రెంజలో ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే త్రివిక్రమ్ తెరకెక్కించాం అత్తారింటికి దారేది సినిమా సగం లీక్ అయి పెద్ద దుమారమే రేపింది .. తాజాగా మరోసారి త్రివిక్రమ్ సినిమాకు లీకుల సమస్య మొదలైందని అర్థం అవుతుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ముందు పెద్ద రిస్క్ తప్పదేమో. ఇక ఈ ఫోటో చుసిన ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఖుషి అవుతున్నారు .. తప్పకుండా ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తారట.

  •  
  •  
  •  
  •  

Comments