సెట్ లోకి మొబైల్స్ తీసుకురావొద్దట.. త్రివిక్రమ్ ఆదేశాలు!

Tuesday, July 24th, 2018, 04:52:10 PM IST

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా సినిమాకు సంబందించిన ఒక కీలక సన్నివేశం తాలూకు ఫొటో లీకవ్వడం వైరల్ అయ్యింది. లీకుల బాధ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కొత్తేమి కాదు. గత సినిమాల్లో చాలా వరకు ఎదో ఒకటి అధికారికంగా విడుదల చేసేలోపే లీక్ అవ్వడం పెను దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమా సగానికి పైగా ఒరిజినల్ ప్రింట్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

అసలు విషయంలోకి వస్తే ఇక నుంచి సినిమాకు సంబందించిన ఎలాంటి విషయం బయటకు వెళ్లకూడదని స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారట. అందుకోసం సెట్ లో ఎవ్వరిదగ్గర మొబైల్ ఉండకూడదని త్రివిక్రమ్ ఆదేశాలు జారీ చేశారట. అత్యవసరం అనుకుంటే సెట్ కి దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడుకోవాలని చెప్పారట. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్మెంట్ కి ఇది స్పెషల్ గా వివరించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగనుందట. తారక్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments