త్రివిక్రమ్ ఆ నిర్మాతకు డబ్బు తిరిగి ఇచ్చేశాడట ?

Monday, October 1st, 2018, 10:17:41 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఏ నిర్మాత నో అంటాడు చెప్పండి .. అందుకే ఆయనకు ముందే అడ్వాన్స్ ఇచ్చేసి .. తమ బ్యానర్ లో సినిమా చేయాలనీ నిర్మాతలు ముందే బుక్ చేసుకుంటారు. అయితే అలాగే ఓ నిర్మాత ఈ దర్శకుడితో సినిమా చేయాలనీ ప్లాన్ చేసి అడ్వాన్స్ ఇచ్చి కమిట్మెంట్ తీసుకున్నాడు. మధ్యలో ఏమైందో ఏమో .. త్రివిక్రమ్ సదరు నిర్మాతకు డబ్బులు వాపస్ ఇచ్చేశాడట ? ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా నిర్మాత ఏమా కథ అంటే .. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తీ కావొచ్చింది. హారిక హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల ప్లాన్ చేశారు. ఈ సినిమా తరువాత ప్రముఖ నిర్మాత డివివి దానయ్యతో సినిమా చేయాలనీ అనుకున్నాడు. వీరిద్దరి మధ్య డీల్ కుదిరింది. ఎప్పటికైనా త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ప్లాన్ చేసిన దానయ్యకు నిరాశే ఎదురైంది. త్రివిక్రమ్ అడ్వాన్ తిరిగి ఇవ్వడంతో అయన త్రివిక్రమ్ తో సినిమా అన్న కల కలగానే మిగిలిపోయింది. అసలు ఎందుకు త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చాడు అన్నది షాకింగ్ గా మారింది. దానయ్య ప్రస్తుతం రామ్ చరణ్ – బోయపాటి లతో సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టి స్టారర్ ప్లాన్ చేసాడు.