త్రివిక్రమ్ – పవన్ రెమ్యునరేషన్ అంత దాటిందా?

Thursday, January 11th, 2018, 12:30:10 PM IST

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ చాలా వరకు హిట్ అవుతుంటాయి. దర్శకుడు హీరో కలిసి వరుసగా రెండు హిట్స్ అందుకుంటే.. మూడవ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉంటాయి. అదే తరహాలో మూడవసారి కలిసిన త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసిపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. మొదటి సారి పవన్ కళ్యాణ్ సినిమా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే సినిమా అనుకున్నంతగా టాక్ ను అందుకోలేకపోయింది.

అయితే ప్రస్తుతం సినిమా గురించి ఒక న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. దర్శకుడికి హీరోకి కలిపి రెమ్యునరేషన్ ను రూ.50 కోట్ల వరకు ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ రేంజ్ ని బట్టి రూ.30 కోట్లు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడని ఇక దర్శకుడు త్రివిక్రమ్ రూ.20 కోట్లు అందుకున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా మొత్తంగా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ రూ.40 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. పండగ సీజన్ లో సినిమా తెచ్చే కలెక్షన్స్ ఇప్పుడు ముఖ్యం కానున్నాయి. మరి సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి.