మరో హీరోతో సినిమా నిర్మిస్తున్న త్రివిక్రమ్ ?

Tuesday, February 28th, 2017, 10:03:16 AM IST


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ”అ ఆ” తరువాత పవన్ తో సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు ఈ మద్యే నిర్మాతగా కూడా అడుగు పెడుతూ యువ హీరో నితిన్ తో చైతన్య కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసాడు త్రివిక్రమ్ . త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాతో పాటు మరో హీరోతో సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేసాడు క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్. ఈ సారి అయన శర్వానంద్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ అసోసియేట్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.