పవన్ తో కోబలి తీస్తానంటున్న దర్శకుడు ?

Sunday, May 27th, 2018, 01:47:33 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు పులిస్టాప్ పెట్టేసి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో 2019 తరువాత కోబలి సినిమా తెరెకెక్కించే అవకాశం ఉండొచ్చని అంటున్నాడు క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్? పవన్ – త్రివిక్రమ్ ల మధ్య మంచి స్నేహం నెలకొన్న విషయం తెలిసిందే. జల్సా .. అత్తారింటికి దారేది వంటి సంచలన చిత్రాలను అందించిన త్రివిక్రమ్ మరో వైపు అజ్ఞాతవాసి లాంటి డిసాస్టర్ చిత్రాన్ని చేసాడు. అయితే వీరిద్దరి కలయికలో కోబలి తెరకెక్కించే ప్రయత్నాలు ఆ మధ్య జరిగాయి .. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో అసలు ఫ్యాక్షన్ ఎలా పుట్టి .. పురులు విప్పుకుంది అన్న కథాంశంతో తీయాలని ప్లాన్ చేసారు. ఆ తరువాత ఈ సినిమాకు ప్రయత్నాలు ఆగిపోయిన నేపథ్యంలో తాజాగా త్రివిక్రమ్ పవన్ తో కోబలి సినిమా తీస్తానని అంటున్నాడు. అంటే ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పకనే చెప్పాడు. చూద్దాం మరి త్రివిక్రమ్ చెప్పిన కొబాలి పట్టాలు ఎక్కుతుందా లేదా ?

  •  
  •  
  •  
  •  

Comments