అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌.. లేటెస్ట్ ఇంట‌ర్వ్యూలో.. పవన్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన త్రివిక్ర‌మ్..!

Tuesday, October 9th, 2018, 04:17:54 PM IST

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌వ‌న్-త్రివిక్ర‌మ్‌ల స్నేషం ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందే. దీంతో ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ఆయ‌న స్పీచ్‌లు త్రివిక్ర‌మ్ రాస్తాడ‌ని పెద్ద టాకే న‌డుస్తోంది. అయితే తాజాగా ఈ విష‌యం పై క్లారిటీ ఇచ్చాడు త్రివిక్ర‌మ్.

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ తాజాగా తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. ఈ చిత్రం ఈ నెల 11న విడుద‌ల కానుంది. దీంతో తాజాగా ఇంట‌ర్వ్యూ ఇచ్చిన త్రివిక్ర‌మ్‌ని స‌ద‌రు యాంక‌ర్ ప్ర‌శ్నిస్తూ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీకు మంచి మిత్రుడు క‌దా.. ఆయ‌న ఇంకొన్ని చిత్రాల్లో న‌టిస్తే బాగుంటుంది క‌దా.. ప‌వ‌న్‌కు మీరు స‌ల‌హా ఇవ్వొచ్చుక‌దా అని ప్ర‌శ్నించ‌గా.. ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇచ్చేంత సీన్ త‌న‌కు లేద‌ని అన్నారు.

యాంక‌ర్ ఇంకో ప్ర‌శ్న వేస్తూ.. రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాన్ మీకు చెప్పారా.. అని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళితే నాకు ఎందుకు చెబుతారు.. ప‌వ‌న్ ఏదైనా చేయాల‌నుకున్న‌ప్పుడు చిరంజీవి గారికే చెప్ప‌డు.. అలాంటిది నాకెందుకు చెబుతాడు అని త్రివిక్ర‌మ్ కొంచెం క‌టువుగా స‌మాధానం చెప్పారు. అయితే ప‌వ‌న్‌తో స్నేహం మాత్రం జీవితాంతం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని త్రివిక్ర‌మ్ అన్నారు.

ఇక‌పోతే ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌సంగాలు అన్నీ తానే రాస్తాన‌ని ఓ చెత్త రూమ‌ర్ ఉంది. ఆయ‌న ప్ర‌సంగాల‌కు నేను స్క్రిప్టులు రాయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌కు తెలుగు భాష పై మంచి ప‌ట్టుఉంది.. ఖాలీగా ఉంటే ఎప్పుడూ ఏదో ఒక పుస్త‌కం చ‌దువుతూనే ఉంటాడు.. రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు ఉన్న అనుభ‌వం నాకు లేదు.. అస‌లు నిజం చెప్పాలంటే నాకు రాజ‌కీయాలే తెలియ‌వు.. నా స్క్రిప్టులు నేను రాసుకోవ‌డానికే నాకు బ‌ద్ద‌కం ఎక్కువ‌.. అలాంటిది నేను ప‌వ‌న్‌కు స్క్రిప్టులు రాసిచ్చే ఛాన్సే లేద‌ని త్రివ‌క్ర‌మ్ తేల్చేశారు.