అజ్ఞాతవాసి చేదు ప్రయాణంలో త్రివిక్రమ్ మరో తప్పు..!

Thursday, January 18th, 2018, 01:55:59 AM IST

ప్రియ మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అజ్ఞాతవాసి చిత్రాన్ని త్వరగా మరచిపోయి పవన్ కొత్త సినిమా మొదలు పెట్టాలని ఆయన అభిమానులే కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ చిత్రాలతోనే అజ్ఞాతవాసిని దారుణమైన చిత్రంగా అభిమానులే అభివర్ణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాస్ పొటెన్షియాలిటీ గురించి తెలిసి కూడా త్రివిక్రమ్ క్లాస్ కథని ఎంచుకుని దానిని గందరగోళం చేసేశాడు. తాము ఘనంగా చెప్పుకునే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటికూడా సినిమాలో లేదని పవన్ అభిమానులు అంటున్నారు. అత్తారింటికి దారేది కూడా క్లాస్ చిత్రమే. అందులో కామెడీ, సెంటిమెట్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ సారి మాత్రం పవన్ అభిమానులు త్రివిక్రమ్ నుంచి అలాంటి కథని ఊహించలేదు. పైగా అందులో అలట్టుకునే అంశాలు లేకపోవడంతో సినిమాకు పెద్ద డ్యామేజ్ జరిగింది.

సినిమా దారుణమైన ప్లాప్ టాక్ తోనే తొలివారంలో రూ 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కనీసం యావరేజ్ గా చిత్రం ఉన్నా డిస్ట్రిబ్యూటర్ లందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండేవారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రం ఆరంభం నుంచి అభిమానులకు ఆసక్తి కలిగించిన అంశం వెంకీ క్యామియో. మొదట చిత్రం విడుదల అయినప్పుడు వెంకీ నటించిన సన్నివేశాన్ని ఎడిటింగ్ లో తొలగించారు. సినిమా విడుదలయ్యాక వెంకీ నటించిన సన్నివేశం ఇంతకంటే గొప్పగా ఏం ఉంటుందిలే అని ఫాన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. జరిగిన డ్యామేజ్ కొంత వరకైనా తగ్గించడానికి త్రివిక్రమ్ సంక్రాంతి నుంచి వెంకీ నటించిన సన్నివేశాన్ని జత చేశారు. అనుకున్నట్లు గానే ఈ ప్రయత్నం కూడా తుస్సుమంది. ఈ మాత్రం సీన్ కోసం వెంకీని నటింపజేశారా అంటూ త్రివిక్రమ్ పై విమర్శలు ఎక్కువవుతున్నాయి.