షాక్ .. రాజకీయాల్లోకి క్రేజీ దర్శకుడు ?

Saturday, October 28th, 2017, 10:14:31 AM IST

తాజాగా ఈ న్యూస్ సంచలనం క్రియేట్ చేస్తుంది. క్రేజీ దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న ఆ దర్శకుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదికూడా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాడని ఆ వార్తల సారాంశం !! ఇంతకీ ఎవరా దర్శకుడు ఏమా కథ అంటే .. టాలీవుడ్ లో మాటల మాంత్రికుడిగా ఇమేజ్ తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ? అవునా !! అంటే అవుననే సమాధానం వస్తుంది .. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కు మంచి స్నేహం ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో పార్టీ కి మరింత క్రేజ్ తీసుకురావడానికి త్రివిక్రమ్ ను రంగంలోకి దింపుతున్నాడట పవన్ ? ఇప్పటికే జనసేన పార్టీ కి సంబందించిన ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయిన త్రివిక్రమ్ భీమవరం నుండి పోటీ చేస్తాడని టాక్ !! మరి ఈ విషయంలో త్రివిక్రమ్ నిర్ణయం ఏమిటా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇంకెవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి!!