పవన్ నెక్స్ట్ మూవీ కూడా త్రివిక్రమ్ చేతిలోనే..?

Wednesday, October 25th, 2017, 04:20:39 PM IST

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల స్నేహం సినిమాలకు అతీతమైనది. ఏదైనా ఈవెంట్ కి వెళ్లాలన్నా ఇద్దరూ కలిసే వెళతారు. సలహాలు సూచనలు కావాలన్నా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని సంప్రదిస్తాడనే ప్రచారం ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన చీఫ్ గా రాజకీయ కార్యక్రమాలు చేస్తూనే త్రివిక్రమ్ సినిమాల్లో నటిస్తున్నాడు. నిన్ననే జరిగిన జనసేన పార్టీ ప్రారంభోత్సవవేడుకకు త్రివిక్రమ్ హాజరైన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఏడాది ఎన్నికల హడావిడి ప్రారంభం కానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో చిత్రాన్ని ప్రారంభిస్తాడా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి.

సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఓ యువ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓ తమిళ చిత్ర కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం. ఇంటర్వల్ తరువాత నుంచి కథని పూర్తిగా పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా దర్శకుడు మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉంటాడు కాబట్టి త్రివిక్రమ్ కి కథని ఫైనలైజ్ చేసే భాద్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అంటే త్రివిక్రమ్ ఓకే చేస్తేనే పవన్ మరో సినిమా చేస్తాడన్న మాట.