పవన్ కు నచ్చిన కథ వెంకటేష్ చేస్తాడట?

Friday, September 14th, 2018, 04:22:07 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక కథ సెట్స్ పైకి వెళ్లాలంటే అప్పుడపుడు పలువురు హీరోలను ధాటి వెళుతుంది. మొత్తానికి ఎవరో ఒకరు ఫైనల్ చేస్తారు. ఇక రీసెంట్ గా పవన్ కు నచ్చిన కథ ఒకటి మరో హీరోకు వెళ్లిందట. ఆ కథను ఒకే చేసిన హీరో మరెవరో కాదు. విక్టరీ వెంకటేష్. ఒకప్పుడు మంచి ఫ్యామిలీ కథలతో ఆడియెన్స్ లో తనకంటు ఒక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను చేసి రికవర్ అవ్వాలని అనుకుంటున్నాడు.

అందులో భాగంగానే త్రివిక్రమ్ రీసెంట్ గా వినిపించిన కథను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అజ్ఞాతవాసి సినిమాకంటే ముందు పవన్ ఆ కథను చాలా ఇష్టపడ్డారట. తరువాత చేద్దామని త్రివిక్రమ్ కు ఒక సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం రాజకీయల దృష్ట్యా పవన్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్ తో ఆల్ రెడీ ఒక సినిమా కమిట్ అవ్వడంతో ఆయనతో పవన్ కు నచ్చిన కథ చేస్తే బావుంటుందని ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments