ఎన్టీఆర్ కు అజ్ఞాతవాసి లాంటి మ్యూజిక్ వద్దు.. కాబట్టి..!

Sunday, January 14th, 2018, 06:25:38 PM IST

అనిరుద్ రవిచంద్రన్ ఎంతో టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడు. చిన్న వయసులోనే సంగీతంతో అతడు చేసిన ప్రయోగాలు అభినందనీయం. తమిళ్ లో అతడు మ్యూజిక్ అందించిన చిత్రాలు చాలా సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు లో అనిరుద్ చేసిన తొలి చిత్రం అజ్ఞాతవాసి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. సినిమా పరాజయం చెందినప్పుడే అందులో ఉండే ప్రతి పొరపాటు బయటకు వస్తుంది. ప్రధాన కారణం కాకపోయినా అనిరుద్ అందించిన సంగీతం కూడా అజ్ఞాతవాసిని వెనక్కి నెట్టడానికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అలాగని అనిరుద్ మంచి సంగీతం ఇవ్వకుండా పోలేదు. కానీ అది పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి సూటయ్యే మ్యూజిక్ కాదు.

దర్శకుడు త్రివిక్రమ్ పట్టుబట్టి ఇలాంటి సంగీతాన్ని రాబట్టాడని ఓ టాక్ ఉంది. కాగా తరువాత త్రివిక్రమ్ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ చిత్రానికి కూడా అనిరుద్ రవిచంద్రనే సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ కూడా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అజ్ఞాతవాసికి వలే క్లాసికల్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇస్తే అభిమానులకు ఎక్కదు. దీనిపై త్రివిక్రమ్, ఎన్టీఆర్ లలో పునరాలోచన మొదలైందనే టాక్ వినిపిస్తోంది. అటు త్రివిక్రమ్ కు, ఇటు ఎన్టీఆర్ కు బాగా కలసి వచ్చిన దేవిశ్రీప్రసాద్ ని రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైనట్లు ఇండస్ట్రీ లో టాక్.