జగన్ కు తలనొప్పిగా మారనున్న ఈ సంచలనాత్మక నిర్ణయం..తీస్కోకపోడమే మంచిది

Wednesday, June 5th, 2019, 11:46:55 AM IST

వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకోనున్న ఒక సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు జగన్ కే తల నొప్పిగా మారనుంది అని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ అయ్యింది.జగన్ అధికారంలోకి రాగానే ముందు ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రక్షాళన మొదలు పెట్టారు.ఇంతకు ముందున్న పథకాలలో ఎన్టీఆర్ ఆరోగ్య స్కీం పథకం ను తాజాగా జగన్ వై ఎస్సార్ ఆరోగ్య శ్రీ గా మార్చేసిన సంగతి తెలిసిందే.ఇలా జగన్ మొత్తం దాదాపు ఒక 20 నుంచి 30 పథకాలకు ఒక్క వైఎస్సార్ పేరునే పెట్టేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.

ఈ నిర్ణయం కానీ జగన్ కనుక తీసుకున్నట్లయితే వైసీపీ అభిమానులుకు బాగానే ఉంటుంది కానీ సామాన్య ప్రజానీకానికి మాత్రం అంత రుచించదని ఇప్పుడు విశ్లేషకులు అంటున్నారు.జగన్ ఇలా అధికారంలోకి వచ్చిన ప్రతీ ఒక్కరు వారి కుటుంబ పేర్లు పెట్టుకొని స్వయం పరిపాలన చెయ్యాలని చూస్తున్నారా అంటూ అప్పుడే సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు మొదలయ్యాయి.ఇలా జగన్ ప్రతీ పథకానికి వైఎస్ పేరు పెట్టడం కరెక్ట్ కాదని ఈ విషయంపై జగన్ మరోసారి ఆలోచిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇస్తున్నారు.ముఖ్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకోకపోడమే ఇంకా మంచిదని వారు భావిస్తున్నారు.